: గులాబి రంగు ఎంపీటీసీ, తెల్ల రంగు జడ్పీటీసీ: రమాకాంత్ రెడ్డి


రేపు స్థానిక సంస్థలకు సంబంధించి తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుతున్నాయని ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి రమాకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఓటరుకు రెండు పోల్ షీట్లు ఇస్తామని చెప్పారు. గులాబీ రంగులో ఉన్న షీట్ ఎంపీటీసీకి, తెల్ల రంగులో ఉన్నది జడ్పీటీసీకి ఇస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లా మంథనిలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం 1.50 లక్షల పోలింగ్ బాక్సులు సిద్ధం చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News