: కత్రినా, నీతూ ఆంటీ ఒప్పుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటా: అలియాభట్
బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ చిన్న కుమార్తె, వర్థమాన తార అలియాభట్ యువహీరో రణబీర్ కపూర్ ను పిచ్చిగా ప్రేమిస్తోంది. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో అలియా తన మనసులోని మాట బయటపెట్టింది. కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన కోరికను బహిర్గతం చేసింది. రణబీర్ మంచోడని, అతని తల్లి నీతూ కపూర్, కత్రినా కైఫ్ కు అభ్యంతరం లేకపోతే అతనిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తనకు వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రాతో ఎఫైర్ ఉందని, అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నానన్న వార్తలన్నీ అవాస్తవాలని అలియా భట్ తెలిపింది. ఈ కార్యక్రమం రేపు ఓ హిందీ టీవీ ఛానెల్ లో ప్రసారం కానుంది.