: చంద్రబాబుని మళ్లీ సీఎం చేయాలి : మురళీమోహన్
రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రముఖ సినీనటుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాగంటి మురళీ మోహన్ పిలుపునిచ్చారు. చంద్రబాబును సీఎం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఎన్టీఆర్ ఆశయ సాధనకోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని మురళీమోహన్ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, 32 కిలోల కేకు కట్ చేశారు.