: కాంగ్రెస్ కు వసుంధరా రాజె హెచ్చరిక
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియా కాంగ్రెస్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ కాంగ్రెస్ సహరాన్ పూర్ లోక్ సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ కొన్ని రోజుల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై ఆమె స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యల వల్ల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తప్పదన్నారు. అందుకు నేతలు సిద్ధంగా ఉండాలని వసుంధర సూచించారు.