: ఆప్ జాబితాలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ ఆభ్యర్థులు
ఆమ్ ఆద్మీ పార్టీ 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఉండడం విశేషం. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి నియోజకవర్గంలో మాజీ కేంద్ర మంత్రి 2జీ స్పెక్ట్రం కుంభకోణం నిందితుడు ఎ.రాజా పోటీ చేస్తుండగా, ఆయనపై ఆప్ ఒక విద్యావేత్తను బరిలోకి దింపింది. ఎం.టి. రాణి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా రాజాపై పోటీ చేయనున్నారు.