: ఏడు లోక్ సభ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
తెలంగాణలోని ఏడు లోక్ సభ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నల్గొండ నుంచి రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, వరంగల్ నుంచి కడియం శ్రీహరి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మందా జగన్నాథం, కరీంనగర్ నుంచి బి వినోద్ పేర్లు ప్రకటించారు.