: అక్కడ అప్పడాల కర్రే వారికి ఆయుధం!
పంజాబ్ ఎన్నికల్లో ఈసారి ప్రత్యేక భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. అయితే వారు పోలీసులు కారు. ప్రభుత్వంతో వారికెలాంటి సంబంధం లేదు. వారంతా బేలన్ బ్రిగేడ్ సభ్యులు. ఈ బేలన్ బిగ్రేడ్ ను లూథియానాకు చెందిన 42 ఏళ్ల అనితా శర్మ ప్రారంభించారు. ఇప్పడీ బేలన్ బ్రిగేడ్ సభ్యులు పంజాబ్ ఎన్నికల్లో మద్యం, మాదకద్రవ్యాల ప్రభావాన్ని తగ్గించేందుకు కంకణం కట్టుకున్నారు.
బేలన్ అంటే ‘అప్పడాల కర్ర’. అప్పడాల కర్రే ఆయుధంగా వీరు ముందుకు కదులుతున్నారు. పోలీసులు లాఠీ వాడేందుకు ఆలోచిస్తారేమో కానీ, వీరు అప్పడాల కర్రతో మరింకేం ఆలోచించకుండా బాది పారేస్తారు. ఇప్పుడు బేలన్ బ్రిగేడ్ పంజాబ్ అంతటా విస్తరించింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు మద్యాన్ని లేదా మాదకద్రవ్యాలను ఇచ్చారని తెలిస్తే చాలు, అప్పడాల కర్రలు బయల్దేరతాయి. ఆ తరువాత బొప్పి కట్టిన బుర్రలే మిగులుతాయి.