: అద్వానీ నుంచి చాలా నేర్చుకున్నా...కాంగ్రెస్ రహిత దేశంగా తీర్చిదిద్దుతా: మోడీ
బీజేపీ సీనియర్ నేత అద్వానీ నుంచి చాలా నేర్చుకున్నానని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి, బీజేపీకి, అద్వానీకి సేవ చేయడం తన అదృష్టమని అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 20 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని ఆయన తేల్చేశారు. గుజరాత్ లోని 28 స్థానాల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ రహిత దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మోడీ పేర్కొన్నారు.