: ఎన్నికల వస్తువులకు భలే గిరాకీ


ఎన్నికలు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఢిల్లీలోని సాదర్ బజార్ ఎన్నికల ప్రచార సామాగ్రికి పెట్టింది పేరు. ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. డెమో బ్యాలెట్ బాక్సులు, టీ కప్పులు, లేజర్ లైట్ పెన్నులు, వాచీలు, స్కార్ఫ్ లు, బొట్టు బిళ్లలు, నేతల ఫొటోలు, 3డీ పాకెట్ కేలండర్లు, మొబైల్ కవర్లు, మాస్కులు, హ్యాండ్ బ్యాగులు తదితర వస్తువులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. వీటికి మంచి స్పందన వస్తోందట. మహిళా ఓటర్ల కోసం వ్యాపారులు ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మంగళసూత్రాలు, టీ సెట్లు, స్కార్ఫ్ లను పార్టీల కోసం అందుబాటులో ఉంచారు.

  • Loading...

More Telugu News