: టీవీ ఆర్టిస్టులకు సీపీఐ నారాయణ బాసట


అనువాద సీరియల్స్ ను రాష్ట్రంలో నిషేదించాలంటూ కొంతకాలంగా టీవీ ఆర్టిస్టులు పోరుబాటపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు దఫాలుగా మాటీవీ ముందు ధర్నానిర్వహించారు కూడా. ఫలితంగా త్వరలోనే దీనిపై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని మాటీవీ యాజమాన్యం మాటిచ్చింది.  ఇప్పటికే అనువాద సీరియల్స్ నిలిపివేయాలని ప్రముఖ మీడియా సంస్థ ఈటీవీ నిర్ణయించిన సంగతి విదితమే.
 
ఇప్పుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మన రాష్ట్ర టీవీ ఆర్టిస్టులకు బాసటగా నిలిచారు. అనువాద టీవీ సీరియల్స్ నిషేధించాలంటూ ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇవాళ లేఖ రాసారు. సీఎం సానుకూలంగా స్పందించకపోతే నిషేధం ఉత్తర్వులు వెలువడే వరకూ పోరాడతామని నారాయణ తన లేఖలో పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News