: విన్నింగ్ షాట్ ఆనందం ధోని మిగిల్చాడు: కోహ్లీ


క్రికెట్ మ్యాచ్ లో ఎన్ని బంతులు ఆడినా రాని ఆనందం, ఒక్క విన్నింగ్ షాట్ ఆడితే వచ్చేస్తుంది. విన్నింగ్ షాట్ కొట్టిన ఆటగాడిని అభిమానులు కూడా అంత త్వరగా మర్చిపోరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కెప్టెన్ ధోనీ. టీమిండియా కెప్టెన్ కాక ముందు ధోనీ చాలా మ్యాచ్ లలో విన్నింగ్ షాట్స్ కొట్టి అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో విన్నింగ్ షాట్ కొట్టే అదృష్టాన్ని కోహ్లీకి ఇచ్చి అతడి మనసునూ ధోనీ గెల్చుకున్నాడు.

టీమిండియా 167 పరుగుల వద్ద ఉండగా, ధాటిగా ఆడుతున్న సురేష్ రైనా హెండ్రిక్స్ బౌలింగ్ లో డుప్లెసిస్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. దీంతో ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు. 19 వ ఓవర్ చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా, ధోనీ క్రీజులో ఉన్నాడు. హెండ్రిక్స్ స్లో, షార్ట్ బంతిని విసిరాడు. సాధారణంగా ధోనీకి అలాంటి బంతి దొరికితే మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించేవాడు.

అప్పటికే కోహ్లీ ధోనీతో మాట్లాడుతూ 'ఆప్ కతమ్ కరో' అని అన్నాడు. అయినప్పటికీ ఎంతో సులువుగా వచ్చిన బంతిని నవ్వుతూ డిఫెన్స్ ఆడాడు. తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీతో 'తూనే అచ్చీ బ్యాటింగ్ కరీహై, తో యే మేరా గిఫ్ట్ హై తేరేలియే, కతమ్ కరో' అని చెప్పాడు. అంతే 20వ ఓవర్ తొలి బంతిని స్టెయిన్ సంధించగానే బౌండరీకి తరలించి భారత జట్టుకు కోహ్లీ విజయాన్నందించారు. ఈ విషయాన్ని కోహ్లీ చెప్పాడు.

  • Loading...

More Telugu News