: మాలమహానాడు తరఫున 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు: కారెం శివాజీ


రానున్న ఎన్నికల్లో మాలమహానాడు తరపున 48 మంది అభ్యర్థులు అసెంబ్లీకి పోటీచేస్తారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. మాలలకోసం ఏ పార్టీ కూడా ఏమీ చేయలేదని ఆరోపించారు. వైకాపాను ఓ విషవృక్షంగా వర్ణించారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు ఎస్సీ వర్గీకరణకు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. పేదల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా దళితులకు చేసిందేమీలేదని స్పష్టం చేశారు. అందుకే, హక్కుల సాధన కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News