: ఆగ్రాలో స్కూల్ విద్యార్థిని అపహరణ, ఆపై అత్యాచారం


ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలో ఘోరం జరిగిపోయింది. 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. శుక్రవారం సాయంత్రం ట్యూషన్ కు వెళుతున్న విద్యార్థినిని ముగ్గురు యువకులు కారులో అపహరించి తీసుకెళ్లారు. ఓ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు కాపలాగా ఉండగా... మరొకడు అత్యాచారం చేశాడు. అనంతరం మధునగర్ లో ఆమెను వదిలేసి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులూ బాలికకు తెలిసినవారేనని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News