: టీడీపీ, బీజేపీ పొత్తు రాజకీయ అవకాశవాదమే: మధుయాష్కీ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ పొత్తుపై కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరి పొత్తు పూర్తిగా రాజకీయ అవకాశవాదమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో వారి పొత్తు చిత్తుకాక తప్పదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క కాంగ్రెస్ కే సాధ్యమన్న యాష్కీ తమ పార్టీని ప్రశ్నించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు.