: భద్రాచలంలో పెరిగిన భక్తుల రద్దీ
ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో పాపికొండలు, పర్ణశాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే గోదావరి తీరంలో పుణ్యస్నానాలాచరించారు. అనంతరం స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఈ రోజు ధ్వజపట భద్రక మండల లేఖనం నిర్వహించారు. సాయంత్రం గరుడాధివాసం జరగిన అనంతరం 7 గంటలకు స్వామివారు తిరువీధుల్లో విహరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ సన్నిధిలోని యాగశాలలో వేదపండితులు, అర్చకులు బ్రహ్మోత్సవ ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.