: టీడీపీ, బీజేపీల మధ్య నేడు తేలనున్న పొత్తులు


టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు ఈ రోజు ఒక కొలిక్కి రానుంది. నిన్న రాత్రి 8 గంటలకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్ధుల తొలిజాబితా విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చివరి క్షణంలో ఈ జాబితా విడుదలను ఈ రోజుకి వాయిదా వేశారు. బీజేపీ జాతీయ స్థాయి అగ్రనేతలు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నట్టు సమాచారం ఇవ్వడంతో, జాబితా విడుదలను ఈ రోజుకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో పోటీ చేసే స్థానాలపై ఇంకా ఒక అవగాహనకు రాలేదని తెలుస్తోంది. ఇక సీమాంధ్రలో 5 లోక్ సభ, 15 శాసనసభ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు సమాచారం. విశాఖపట్నం, అరకు, రాజంపేట, నరసాపురం, తిరుపతి లోక్ సభ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News