: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: కిషన్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేయాలి కనుక పోటీ చేయకూడదనే యోచనలో ఉన్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తామని ఆయన అన్నారు.
టీడీపీతో ఎన్నికల పొత్తుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. రేపు సాయంత్రంలోగా చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల్లో 50కి పైగా అసెంబ్లీ, 9 పార్లమెంటు స్థానాలకు బీజేపీ పోటీ చేయవచ్చునని ఆయన అన్నారు.