: సికింద్రాబాదు-విశాఖ మధ్య కొత్త ప్రీమియం రైలు
వేసవి సెలవుల నేపథ్యంలో సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా వేగవంతమైన ప్రీమియం రైలు పట్టాల పైకి ఎక్కుతోంది. దీంతో సికింద్రాబాదు నుంచి విశాఖకు రెండున్నర గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ నెల 17వ తేదీ రాత్రి 11 గంటలకు సికింద్రాబాదు నుంచి బయల్దేరి విశాఖకు వెళుతుంది. 20వ తేదీన 9.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి సికింద్రాబాదుకు చేరుకుంటుందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ రైలుకు వెయిటింగ్ లిస్ట్ ఉండదని, ఈ రైలు టిక్కెట్లను ఆన్ లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని రైల్వే పీఆర్వో సాంబశివరావు చెప్పారు.