: మైఖేల్ షుమాకర్ కోలుకుంటున్న సూచనలు


ఫార్ములా వన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మైఖేల్ షుమాకర్ కోమా నుంచి కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆయన మేనేజర్ కెమ్ ఈ రోజు ప్రకటించారు. 45 ఏళ్ల షుమాకర్ డిసెంబరు 9న ఫ్రాన్స్ లో స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన తలకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే గ్రెనోబుల్ ఆస్పత్రిలో ఆయనకు అత్యవసర చికిత్స చేసి ఆర్టిఫిషియల్ కోమాలో ఉంచారు. అప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఇది శుభవార్తే.

  • Loading...

More Telugu News