: వివాహ వేడుకలో చెలరేగిన చిన్న వివాదం... భారీ విధ్వంసం


మగ పెళ్లివారి చెప్పులు దాచి, డబ్బులు వసూలు చేయడం ఉత్తరాదిలో ఆడపెళ్లివారికి అలవాటు. ఇది అక్కడ చాలా సరదా కార్యక్రమం. కానీ రాజస్థాన్ లో శ్రీగంగా నగర్ జిల్లాలోని రాయ్ సింగ్ నగర్ లో ఒక పెళ్లిలో జరిగిన ఈ తంతు వివాదానికి, విధ్వంసానికి దారితీసింది. ఆఖరికి ఆ పెళ్లే ఆగిపోవడానికి కారణమైంది.

పెళ్లికూతురు వర్గానికి చెందిన వారు మగ పెళ్లివారి చెప్పులు దాచేశారు. ముందు మగపెళ్లివారు అటూ ఇటూ వెతుకులాట ప్రారంభించారు. వ్యంగ్య బాణాలు విసురుకున్నారు. అవి కాస్తా నెమ్మదిగా వెక్కిరింతలకు దారితీసింది. కాసేపటికి మాటామాటా పెరిగింది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా చివరకు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుని, కర్రలతో దాడులు చేసుకొనేంత వరకు వెళ్లింది. ఇదంతా రెండు గంటల పాటు జరిగింది.

ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చివరికి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పెళ్లంటే ఇదంతా మామూలే నంటూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆఖరికి, సంగతి అంతా విన్న పెళ్లికూతురు 'నాకీ పెళ్లే వద్దు' అని తేల్చిచెప్పింది. చెప్పులాటతో ఇన్ని తిప్పలా!

  • Loading...

More Telugu News