: పీఎస్ఎల్వీ-సీ24 ప్రయోగం విజయవంతం
ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ24 ప్రయోగం విజయవంతమైంది. రక్షణ రంగానికి అత్యంత కీలకమైన నావిగేషన్ సేవలను అందించే ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం అవడంతో షార్ లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శాస్త్రవేత్తలు ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నారు.