: సత్యం కేసులో ఈడీ విచారణ ప్రారంభం


సత్యం కుంభకోణం కేసులో హైదరాబాదు, నాంపల్లి కోర్టులో ఈరోజు ఉదయం ఈడీ అభ్యర్ధన విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామలింగరాజుతో పాటు మిగిలిన డైరెక్టర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ కోసం వచ్చిన రాజు, ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు, ‘సత్యం’ మాజీ ఎండీ బి.రామరాజు, మాజీ సీఎఫ్ వో వడ్లమాని శ్రీనివాస్, మాజీ ఆడిటర్లు సుబ్రమణి గోపాలకృష్ణన్, టి శ్రీనివాస్, 'సత్యం' మాజీ ఇంటర్నల్ చీఫ్ ఆడిటర్ వి.ఎస్.ప్రభాకర్ గుప్తా తదితరులు రూ.10 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారు. అనంతరం కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. నిందితులకు చార్జిషీటు ప్రతులు, ఇతర పత్రాలను అందించాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News