: ఉద్యమం చేయని మీకెందుకు సీఎం పదవి?: కేసీఆర్


కాంగ్రెస్, టీడీపీలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని టీఆర్ఎస్ కోరుకుంటే తప్పేముందని... ఏనాడూ ఉద్యమంలో పాలుపంచుకోని కాంగ్రెస్ కు సీఎం పదవి ఎందుకని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 35కు మించి సీట్లు రావని అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు ఓ పెద్ద శని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో వెళ్తున్న బీజేపీ కూడా భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News