: అనంతపురంలో ఉత్సాహంగా సాగిన ఓటరు చైతన్య ర్యాలీ
ఓటర్లలో చైతన్యం నింపేందుకు అనంతపురం ఎన్నికల అధికారులు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో అనంతపురంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా ముందుకు సాగింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో కేవలం 60 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో అధికారులు ఓటర్లలో చైతన్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఓటు గురించి అవగాహన కల్పించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో భారీ సంఖ్యలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.