: కేరళ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు


కేరళలోని ఇడుక్కి జిల్లా సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ధర్మ రాజన్ కు ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదే కేసులో 24 మంది దోషులకు నాలుగు నుంచి 13 సంవత్సరాల వరకు శిక్ష విధించింది. 1996లో 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన కొంతమంది దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తర్వాత ఈ ఘటనలో కేసు నమోదవడం, విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం బాధితురాలిపై 41 మంది అత్యాచారానికి పాల్పడ్డట్లు తేల్చారు. కాగా, తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ కూడా ఉన్నారంటూ ఓ సమయంలో బాధితురాలు ఆరోపణలు చేయడంతో కలకలం రేగింది. అయితే, ఈ కేసులో కురియన్ కు ఎలాంటి సంబంధంలేదని ఆమె పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

  • Loading...

More Telugu News