: సీమాంధ్రలో టీడీపీదే హవా.. ఎన్డీటీవీ సర్వే వెల్లడి!


రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో తెలుగుదేశం హవా కొనసాగనుందని, అగ్రస్థానం దక్కించుకుంటుందని ఎన్డీటీవీ తెలిపింది. ఈ మేరకు ఆంగ్ల చానల్ ఎన్డీటీవీ నిన్న (గురువారం) తెలిపిన సర్వే ఫలితాల ప్రకారం.. సీమాంధ్రలో టీడీపీ కూటమి 46 శాతం ఓట్లను కైవసం చేసుకొని 14 లోక్ సభ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని వివరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను, కాంగ్రెస్ ఒక్క స్థానం గెలుచుకుంటాయని సర్వే తెలిపింది. అటు తెలంగాణలో టీడీపీ రెండు లోక్ సభ స్థానాలను గెలుపొంది మొత్తంమ్మీద 16 ఎంపీ స్థానాలను దక్కించుకుంటుందని ప్రకటించింది. ఇక తెలంగాణలో ఉన్న మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ ఏడు, టీడీపీ కూటమి రెండు, ఇతరులు ఒక్క స్థానాన్ని పొందే అవకాశం ఉందని ఎన్డీటీవీ సర్వే చెప్పింది.

  • Loading...

More Telugu News