: కంకిపాడుకు సమీపంలో కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరి మృతి


కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సు హైదరాబాద్ నుంచి నరసాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

  • Loading...

More Telugu News