: టైటానియం స్కాంలో రూ.111 కోట్లు చేతులు మారాయి: చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన పొలిట్ బ్యూరో భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టైటానియం కుంభకోణంలో మొత్తం రూ. 111 కోట్లు చేతులు మారాయని చంద్రబాబు చెప్పారు. 2006లోనే టైటానియం కుంభకోణానికి బీజం పడిందని ఆయన అన్నారు. అమెరికాకు చెందిన సంస్థ రూ. 111 కోట్లు చెల్లించిందని, దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఎఫ్.బి.ఐ దర్యాప్తు చేసి ఛార్జిషీటు దాఖలు చేసిందని ఆయన అన్నారు. ఈ ఉదంతంతో కొందరు అంతర్జాతీయ స్థాయంలో రాష్ట్రం పరువు తీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News