: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కిరణ్ పర్యటన
జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల పాటు సీమాంధ్రలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 4వ తేదీ (శుక్రవారం) ఉదయం పదిన్నర గంటలకు తెనాలిలో కిరణ్ రోడ్ షో ప్రారంభమవుతుంది. రేపు రాత్రి గుంటూరులోని ఐటీసీ గెస్ట్ హౌస్ లో ఆయన బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ప్రకాశం జిల్లాలో రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం రాత్రి 11 గంటలకు ప్రకాశం నుంచి హైదరాబాదు చేరుకుంటారని ఆయన కార్యాలయ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.