: అదే ప్రపంచంలోని పురాతన మధుశాల


ఐర్లండ్ లో ఉన్న ఆ బార్ ప్రపంచంలోనే అత్యంత పురాతన మధుశాల. షాన్స్ బార్ అనే ఈ పబ్ క్రీస్తు శకం 900 నుంచి ఉందని రికార్డులను బట్టి తెలుస్తోంది. అంతేకాదు, 2004లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ విషయాన్ని సాధికారికంగా ధృవీకరించింది.

ఐర్లండ్ దేశంలోని అథ్లోన్ లో షనన్ నది ఒడ్డున ఈ బార్ ఉంది. 1970వ దశకంలో దీనికి మరమ్మత్తులు చేయిస్తుండగా పాత గోడలు బయటపడ్డాయి. వాటి నిర్మాణంలో వాడిన పదార్థాలను బట్టి అది తొమ్మిదో శతాబ్దం నాటిదని పురావస్తు శాఖ నిపుణులు నిర్థారించారు. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఈ బార్ ఎవరి చేతుల్లో ఉంది? ఆ యజమానుల పేర్లేమిటన్న వివరాలన్నీ బార్ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రఖ్యాత పాశ్చాత్య గాయకుడు బాయ్ జార్జి కూడా కొంత కాలం పాటు ఈ మధుశాలకి యజమానిగా ఉన్నాడట.

  • Loading...

More Telugu News