: ఇంటర్నెట్ సేవలకు స్వల్ప అంతరాయమే: కేంద్ర మంత్రి సిబల్
సముద్రంలో కేబుళ్లు తెగిపోవడం వల్ల దేశంలో ఇంటర్నెట్ సేవలపై పెద్దగా ప్రభావం ఉండదని కేంద్ర ఐటి, టెలికమ్ శాఖ మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు. ఉత్తర భారతదేశంలో ఎటువంటి అంతరాయం ఉండదని, దక్షిణ భారతదేశంలో మాత్రం బీఎస్ఎన్ ఎల్ సర్వీసుల పైనే కొంత ప్రభావం ఉండొచ్చని తెలిపారు. కేబుళ్లు తెగిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.