: సబిత ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
మహేశ్వరం నియోజకవర్గం అసెంబ్లీ సీటు సీపీఐకి కేటాయించొద్దని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహేశ్వరం టికెట్ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించొద్దంటూ నినాదాలు చేశారు. కార్తీక్ రెడ్డికి సీటు కేటాయించకుంటే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో తాను మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని సబిత ఇంద్రారెడ్డి ఆందోళనకారులకు హామీ ఇచ్చారు.