: అభ్యర్థులను ప్రకటించడంలో దూసుకుపోతున్న ఆప్!
సార్వత్రిక ఎన్నికలకు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయవంతమైంది. ఇప్పటివరకూ 13 జాబితాలను విడుదల చేసిన ఆ పార్టీ మొత్తం 426 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీనికి భిన్నంగా జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తర్వాత వరుసలో ఉండటం గమనార్హం. కాంగ్రెస్ 414, బీజేపీ 415 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక సమాజ్ వాదీ పార్టీ 160 మంది అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది.
2012లో ఢిల్లీలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది. దాంతో, ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేయాలని భావించి అత్యధిక అభ్యర్థులను నిలబెడుతోంది.