: రాష్ట్ర విభజన నాకు బాధ కలిగించింది: కావూరి
రాష్ట్ర విభజన తనకు బాధ కలిగించిందని కావూరి సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాను 20,30 రోజుల క్రితమే రాజీనామా చేయాల్సిందని, కాస్త ఆలస్యమైందని ఆయన అన్నారు. తాను చేసిన సూచనలను అధిష్ఠానం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు తనకు నచ్చలేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే ప్రధానిని కలిసి రాజీనామా లేఖ సమర్పించానని కావూరి తెలిపారు.
మంత్రులు చేసిన డిమాండ్లను కూడా కేంద్రం పెడచెవిన పెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టెక్స్ టైల్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశానని ఆయన అన్నారు. పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్ తీసుకురావాలని తాను కోరానని, అయితే, ఎన్నికలు, ఇతర కారణాల వల్ల ఆర్డినెన్స్ తీసుకురాలేకపోయారని ఆయన తెలిపారు.