: దానంపై కేసులను వెంటనే దర్యాప్తు చేయండి: హైకోర్టులో పిటిషన్
మాజీ మంత్రి దానం నాగేందర్ పై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానంపై పలు కేసులు నమోదయ్యాయని... కానీ, పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులను దర్యాప్తు చేయడం లేదని న్యాయవాది ఎ.తిరుపతివర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులను సత్వరమే దర్యాప్తు చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ లో డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, బంజారాహిల్స్ ఎస్ హెచ్ఓ, తుకారాంగేట్ ఎస్ హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
2013లో తనపై దాడి చేసినందుకు, 2011లో దళితుడిపై దాడి చేసినందుకు, మరో రెండు సందర్భాల్లో పోలీసులపై దాడికి దిగినందుకు దానంపై కేసులు నమోదయ్యాయని పిటిషనర్ తెలిపారు.