: ముషారఫ్ పై బాంబు దాడి
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను మట్టుబెట్టేందుకు ఆగంతుకులు శక్తిమంతమైన బాంబును పేల్చారు. ఈ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆర్మీ హాస్పిటల్ నుంచి తన ఫార్మ్ హౌస్ కు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కనున్న డ్రైనేజ్ కాల్వలో ఈ బాంబును అమర్చారు. ఆ సమయంలో ముషారఫ్ తో పాటు శక్తిమంతమైన ఆయుధాలు కలిగిన సెక్యూరిటీ గార్డులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ రోడ్డు మీద నుంచే పాక్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి కూడా ప్రయాణిస్తుంటారు. బాంబు పేలుడు సంభవించిన చోట రెండు అడుగుల మేర గొయ్యి ఏర్పడింది.