: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ
ఢిల్లీలోని వార్ రూమ్ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్, వయలార్ రవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, బొత్స సత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.