: ఇక గూగుల్లోనూ సినిమాలు చూడొచ్చు!
గూగుల్.. ఇదో అంతర్జాల ప్రపంచం. లోపలికి వెళ్తే చాలు బోలెడంత సమాచారం దొరుకుతుంది. మనకు కావల్సిన ఫోటోలు చూడొచ్చు.. మురిసిపోవచ్చు. సకల సౌకర్యాలు అందిస్తూ.. నెట్ విశ్వంలో దూసుకుపోతున్న గూగుల్ కొత్త వినోదానికి తెరలేపింది. సినిమాలు చూడాలనుకుంటే సాధారణంగా మనం థియేటర్ కి వెళ్తాం. లేకుంటే లాప్ టాప్ లో చూస్తాం. ఇకనుంచి గూగుల్లో కూడా సినిమాలు చూడొచ్చు.
అదెలా అనుకుంటున్నారా ? గూగుల్లో.. 'గూగుల్ ప్లే స్టోర్' అని ఒకటుంది. దీనికి గూగుల్ 'ఆండ్రాయిడ్' కు కనెక్షన్ ఉంటుంది. దీనిద్వారా ఏ సినిమా అయినా చూడవచ్చు. అయితే, ఇందులో హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలే అందుబాటులో ఉంటాయి. ప్రాంతీయ చిత్రాలు ఉండవు. మామూలుగా సినిమాలను నెట్ లో డౌన్ లోడ్ చేస్తాం, డీవీడీలు తెచ్చుకుని చూస్తాం. ఇప్పుడలాంటి అవసరం లేదు. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఏ సినిమా కావాలో ఎంపిక చేసుకుని అక్కడి నుంచే డౌన్ లోడ్ కూడా చేయవచ్చు.
అంతశ్రమ ఎందుకనుకుంటే అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఒక సినిమా డౌన్ లోడ్ చేసుకుంటే గూగుల్ అప్లికేషన్ స్థాయి ప్రకారం రూ.390 ఖర్చవుతుంది. ఒకరోజు అద్దెకు తీసుకుంటే వంద రూపాయలు. ఇది కేవలం ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాలకు(స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు లాంటివి) మాత్రమే పరిమితమనేది గమనించాలి. కానీ, అదే సినిమా డీవీడీ బయట కొంటే రూ.100.
ఇంకోవైపు యూట్యూబ్, మిగతా వెబ్ సైట్లు హెచ్ డీ క్వాలిటీతో ఎలాంటి ఛార్జ్ లేకుండా సినిమాలు అందిస్తున్నాయి. అలాంటప్పుడు గూగుల్ ప్లేకు అంత చెల్లించడమెందుకని చాలామంది నెటిజన్లు అంటున్నారు. అయితే ఉద్యోగంతో బిజీగా ఉండి, సినిమాలకు వెళ్లలేని వారికి గూగుల్ సినిమా బాగానే ఉపయోగపడుతుంది.