: రాహుల్ గాంధీకి అప్పిచ్చిన సోనియా...ఆమె ఆస్తి 9.28 కోట్లు
రాహుల్ గాంధీకి అతని తల్లి, ఎఐసీసీ చీఫ్ సోనియా గాంధీ 9 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. సాధారణంగా పెళ్లికాని కుమారుడు ఏదయినా ఇంట్లో ఉంటే అతనికి ప్రత్యేకంగా ఆస్తులు సంపాదన, అప్పులు అంటూ ఉండకపోవడం భారత సంప్రదాయం. పెళ్లి కాని రాహుల్ గాంధీకి సోనియా గాంధీ 9 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు రాయ్ బరేలీలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ అఫిడవిట్లో ఆమె ఆస్తుల విలువ 9.28 కోట్ల రూపాయలు గా పేర్కొన్నారు. 2009 ఎన్నికల అఫిడవిట్ లో సోనియా గాంధీ ఆస్తి 1.37 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. దీంతో గతంలో ఆస్తుల విలువతో పోలిస్తే ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ ఆరు రెట్లు పెరిగింది.