: రాయలసీమలో మేము మెజారిటీలో ఉన్నాము: సీఎం రమేష్


రాయలసీమలో టీడీపీ మెజారిటీలో ఉందని ఆ పార్టీ నేత సీఎం రమేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీని కడపకే పరిమితం చేస్తామని అన్నారు. కడపలో కూడా వైఎస్సార్సీపీకి ఆధిపత్యం లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మీడియా ప్రజలకు నిజాలు చెప్పాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని ఆయన తెలిపారు.

చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని, వనరుల్ని వినియోగించుకుని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై తీవ్రంగా టీడీపీ ఆలోచిస్తుంటే, వైఎస్సార్సీపీ అధినేత జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News