: ఆలేరులో చంద్రబాబుకు కార్యకర్తల ఆత్మీయ స్వాగతం
వరంగల్ లో టీడీపీ నిర్వహిస్తున్న ‘ప్రజాగర్జన’కు హాజరయ్యేందుకు హైదరాబాదు నుంచి బయల్దేరి వరంగల్ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు నల్గొండ జిల్లా ఆలేరులో పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ నాయకులు చంద్రబాబుకు పూలదండలు వేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.