: బ్యాంకు దోపిడీకి దొంగల యత్నం, ఎస్ఐపై కాల్పులు


దోపిడీ దొంగలు మెదక్ జిల్లాలో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేసి అడ్డొచ్చిన ఎస్ఐపైనే కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. కోహిర్ మండలం, కవేలి గ్రామంలో ఉన్న సిండికేట్ బ్యాంకులోకి ఈ ఉదయం ముగ్గురు దొంగలు ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించారు. ఈ సమాచారం అందిన వెంటనే ఎస్ఐ వెంకటేష్ బ్యాంకు దగ్గరకు చేరుకుని లొంగిపోవాలంటూ దొంగలను ఆదేశించారు.
 
వారు తప్పించుకునేందుకు తమ దగ్గరున్న తుపాకులతో ఎస్ఐపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలతో వెంకటేష్ అక్కడే నేలకొరిగారు. ఈ లోపు దొంగలు ఉడాయించారు. తీవ్రంగా గాయాలతో రక్తమోడుతున్న ఎస్ఐను హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తప్పించుకుపోయిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News