: పన్నెండేళ్లలో 98 మందికి తండ్రి
సాధారణంగా ఎవరికైనా ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉంటారు. పాత తరంలో చూసినా పది పన్నెండు మంది ఉండేవారు. అప్పుడు బాల్యవివాహాలు జరగడంతో తొందరగానే గర్భవతులై నడి వయసు వరకు పిల్లల్ని కనేవారు. గత పన్నెండేళ్లుగా అయితే ఫ్యామిలీ ప్లానింగ్ కారణంగా ఇద్దరి ముద్దుకు పరిమితమైపోయాం. కానీ నెదర్లాండ్స్ కు చెందిన ఎడ్ హౌబెన్ మాత్రం 98 మంది పిల్లలకు తండ్రి. గత 12 ఏళ్లలోనే ఆయన ఈ ఘనత సాధించాడు.
నెదర్లాండ్స్ లోని మాస్ట్రిక్ పట్టణంలో నివసించే ఎడ్ హౌబెన్(46) టూర్ గైడ్ గా పని చేస్తారు. 2002 ఏ స్త్రీతో సంబంధంలేని ఎడ్ జర్మనీ కేంద్రంగా పనిచేసే ఓ వెబ్ సైట్ లో వీర్యదాతగా తన పేరు నమోదు చేయించుకున్నాడు. వారు చేేసిన వీర్య సామర్థ్య పరీక్షలో హౌబెన్ స్పెర్మ్ కౌంట్ వంద మిలియన్లని గుర్తించారు. దీంతో ఆ వెబ్ సైట్ ద్వారా పిల్లల్ని కనాలనుకునే వారు ఆయనను కలిసి పిల్లల్ని కనేవారు.
కొంత మంది లోకల్ గా ఉండే ఓ వీర్య బ్యాంకులో వీర్యం దానం చేయించి, దానిని భద్రపరిచి, అమ్ముకునేవారు. ఇలా ఆయన 98 మంది పిల్లల్ని కన్నాడు. ఆయన వద్దకు వచ్చే మహిళలకు పిల్లలు కలగకపోవడానికి కారణాలు, వైద్య పరీక్షల పత్రాలు, వారి ఆరోగ్య సంబంధ రిపోర్టులు తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ఎడ్ తో శృంగారంలో పాల్గొనేందుకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్ లో ఏ ఇబ్బంది రానివ్వమనే బాండ్ పై సంతకాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ చట్టబద్ధంగా పూర్తి చేసిన తరువాతే ఎడ్ వారికి తన వీర్యాన్ని దానం చేస్తాడట.
'భార్యతో గడిపితే ఆమె భర్త అంగీకరిస్తాడా?' అని ఎడ్ ను ఎవరైనా ప్రశ్నిస్తే 'లక్షలు పోసి లాభం లేదనుకుని. దేశ విదేశాలు తిరిగి... పిల్లలు లేని జీవితం శూన్యం అనుకుని నా వద్దకు వచ్చే వారికి కనిపించేంది శృంగారం కాదని... బిడ్డల రూపంలో బంగారు భవిష్యత్' అని తిరుగులేని సమాధానం చెప్తాడు. బెన్ కు మద్యపానం వంటి చెడు అలవాట్లు లేకపోవడం విశేషం.