: హనుమంత వాహనంపై విహరించిన కోదండరాముడు
తిరుపతిలో కొలువైన శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు హనుమంత వాహనంపై ఆసీనులై రామాలయ మాడవీధుల్లో విహరించారు. వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రామయ్యకు మంగళహారతులిచ్చారు. వాహనసేవకు ముందు కోలాటం బృందాల భజనలు, భక్తుల రామనామ స్మరణతో మాడవీధులు మార్మోగాయి.