: కనకదుర్గమ్మ వారధి వద్ద రూ. 6.25 కోట్లు పట్టుబడ్డాయ్..!
గుంటూరు జిల్లా పరిధిలోని తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి వద్ద పోలీసులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వ్యానులో తరలిస్తున్న రూ. 6.25 కోట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 5 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి 1.25 కోట్ల రూపాయలను డ్రా చేసి గుంటూరుకు తీసుకెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదు మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖాధికారులకు అప్పగించనున్నట్లు ఎస్.ఐ. నరేష్ కుమార్ తెలిపారు.