: పవన్ కల్యాణ్ కు రాంగోపాల్ వర్మ సలహాలు


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు వివాదాలు రేపడమన్నా, వివాదాల్లో తలదూర్చడమన్నా బాగా ఇష్టమంటారు సినీ పరిశ్రమకు చెందిన వారు. తాజాగా ఆయన ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్నారు... నిన్న పవనిజం పుస్తకంపై ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ తాజాగా మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను రాజురవితేజ్ తప్పదోవ పట్టిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ ఇజం పుస్తకంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. గతంలో మేధావులు చెప్పిన సిద్ధాంతాలను సమాజం అర్థం చేసుకుందని, వాటినే మరోసారి చెప్పేందుకు పుస్తకం అవసరం లేదని, కావాల్సిందంతా ఏమిటంటే... నిజమైన పవనిజం అంటే ఏమిటి అనేదేనని ఆయన పేర్కొన్నారు. బ్రూస్లీ చెప్పినట్టు 'విజ్ఞానాన్ని నిచ్చెన మెట్లలా పైకి ఎక్కేందుకు ఉపయోగించుకోవాలే తప్ప, నిచ్చెనను భుజం మీద మోసుకుని వెళ్లేందుకు కాదు' అని ఆయన ఉచిత సలహా పడేశారు.

  • Loading...

More Telugu News