: ఆ డ్రోన్ స్మార్ట్ ఫోన్లలోని సమాచారాన్ని దోచేస్తుంది
స్మార్ట్ ఫోన్లలోని వ్యక్తిగత వివరాలను రహస్యంగా సేకరించేందుకు డ్రోన్ (రిమోట్ తో నడిపే చిన్న విమానం)ను అభివృద్ధి చేసినట్లు యూకేలోని సెన్స్ పోస్ట్ అనే భద్రతా సంస్థ తెలిపింది. ఫోన్ వినియోగదారులకు ఏ మాత్రం తెలియకుండా వారి పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలతో పాటు బ్యాంకు ఖాతాల సమాచారాన్ని కూడా ఇది గ్రహిస్తుందని సెన్స్ పోస్ట్ కు చెందిన గ్లెన్ వికిన్సన్ తెలిపారు. ఈ డ్రోన్లలో ఉపయోగించిన స్నూపీ సాఫ్ట్ వేర్ కంప్యూటర్లకు కొత్తేం కాదని, అయితే డ్రోన్లలో ఉపయోగించడం వల్ల దీని ప్రభావం ఎక్కువన్నారు. తమ స్మార్ట్ ఫోన్లలోని వైర్ లెస్ ఆప్షన్ ను సాధారణంగా ఎక్కువ శాతం మంది ‘ఆన్’లోనే ఉంచుతారు. దీని సాయంతో స్మార్ట్ ఫోన్ కు అనుసంధానమై అందులోని సమాచారాన్ని ఈ డ్రోన్లు దొంగిలిస్తాయని గ్లెన్ వివరించారు.