: వనస్థలిపురంలో పిచ్చోడి చేతిలో రాయి
వనస్థలిపురంలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం వేశాడు. శారదానగర్ లో ఒకటి, లక్ష్మీనగర్ లో రెండు, శాంతినగర్ లో మూడు కార్ల అద్దాలు పగులగొట్టి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పరిస్థితి చక్కదిద్దారు.