: నగ్మాకు సెక్యూరిటీ పెంచాలంటూ ఈసీకి కాంగ్రెస్ లేఖ
సార్వత్రిక ఎన్నికల్లో మీరట్ నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి, సినీ నటి నగ్మాకు రక్షణ కల్పించేందుకు అవసరమైన సెక్యూరిటీ పెంచాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాసింది. మీరట్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సినీ నటి నగ్మాను చూసేందుకు, పట్టుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. అదే సమయంలో ఓ యువకుడు ఆమెను ముట్టుకోవడంతో అక్కడే అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ వార్త కాస్తా కలకలం రేపింది. ఈ క్రమంలోనే రక్షణ కోరినట్లు తెలుస్తోంది.