: ప్రాణం తీసిన బర్గర్... ముగ్గురి పరిస్థితి విషమం


బర్గర్... చూస్తేనే నోరూరుతుంది. అలాంటి బర్గర్ ఇప్పుడు ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ పాతబస్తీలోని బాబానగర్ లో ఉన్న బేక్ వెల్ బేకరీలో ఆహారం కలుషితమయింది. అందులో బర్గర్ తిన్న ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో ఎనిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News